Protests Against BBC Documentary On PM Modi | High Tension @Jamia Versity |
|
ప్రధాని నరేంద్ర మోదీపై BBC తీసిన డాక్యుమెంటరీపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో... అనుకూల, వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీని దిల్లీ జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. BBC డాక్యుమెంటరీని విశ్వవిద్యాలయ ఆవరణలో ఫేస్ బుక్‌లో ప్రదర్శించేందుకు సిద్ధమైన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్సిటీ పరిధిలో ఎలాంటి సమావేశాలకు అనుమతి లేదని స్పష్టంచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్యాంపస్‌లో టియర్ గ్యాస్ క్యానన్లతో కూడిన పోలీసులను మోహరించారు. డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు విద్యార్థులకు అనుమతులు లేవని విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం సాయంత్రం దిల్లీలోని JNU విద్యార్థి సంఘం కార్యాలయంలో డాక్యుమెంటరీ ప్రదర్శించడానికి యత్నించగా... ఇంటర్నెట్, విద్యుత్ నిలిపివేశారు. ఆ తర్వాత సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లో డాక్యుమెంటరీని వీక్షించారు. జామియా విశ్వవిద్యాలయంలో డాక్యుమెంటరీని ప్రదర్శన విషంలో విద్యార్థులు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.
---------------------------------------------------------------------------------------------------------------------------- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Visit our Official Website:http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY ☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh ☛ Follow us : https://twitter.com/etvandhraprades ☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh ☛ Etv Win Website : https://www.etvwin.com/ ----------------------------------------------------------------------------------------------------------------------------- |