Aakhari Majili |A New Telugu Short Film Teaser| Reddi Prasad|Naveen Sai|Chandu| Nenu Naa Aalochanalu |
|
ఆఖరి మజిలీ, జీవితపు చివరి అంచులలో మనతో కలిసి నడిచే తోడు అని అర్థం. కానీ, ఇది మాకు మొదటి అడుగు. విజయం కోసం కాదు, విలక్షణమైన ఆశలతీరంలా కనిపించే సినిమా మీద ఉన్న ప్రేమతో చేసిన తొలి ప్రయత్నం. అందరికీ ఎదురయ్యే అనుభవాలే అయినా వాటిని ఎదుర్కోవడంలో, ఎదురుదెబ్బలు తినడంలో తేడా ఉంటుంది, తెలియని పాఠం నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. మేము అలా నేర్చుకున్న పాఠాలే అన్నీ..
ఒంటరిగా మొదలైనా నమ్మి మాతో నడిచిన స్నేహితులు ఉన్నారు, నమ్మకం విడువని శ్రేయోభిలాషులు ఉన్నారు. వారి నమ్మకమే మా మీద మాకు ఎక్కువ నమ్మకాన్ని పెంచుకోవడానికి సహాయపడింది. ఈ రోజు మీ ముందు ఇలా కనిపించడానికి కారణమయ్యింది. కావలసిన సౌకర్యాలు లేవు, అనువైన పరిస్థితులు లేవు, ఎలా చెయ్యాలో తెలియడం లేదు, అనే కారణాలు చెప్పుకుంటూనే చాలా కాలం కలల్లో బ్రతికేశాము. కానీ, ఏది లేకున్నా మా పైన మాకున్న నమ్మకం కోల్పోకూడదని అడుగు ముందుకు వేసిన ధైర్యమే, మా కలల్ని నిజం చేసుకునే వైపుగా నడిపించింది. మా ఈ ప్రయాణంలో మాకు సహాయపడిన ప్రతి స్నేహానికి, ప్రతి నమ్మకానికి మేము చేసిన ఈ ప్రయత్నమే సాక్ష్యం.. Cast : Chandu Vocals : Sai Bhavana, Naveen sai Director : Reddi Prasad Mallela Producer : Nenu Naa Aalochanalu team Music : Joy Rayarala DOP : Naveen sai Sound engineer : David (studio RAGA) Publicity designer : Vikas Editing : Prasad & Naveen You can contact us on Facebook : https://facebook.com/Me.MyViews/ https://www.facebook.com/purecinema.pc/ http://www.facebook.com/MegangWorkRoom Instagram : https://instagram.com/nenu_naa_aalochanalu?igshid=1pmfrx6eag3vt https://instagram.com/pc.purecinema?igshid=n6ilfzubc34d |