♫musicjinni

#APTODAYDIGITALTV-విప్లవాల వేగుచుక్క.. చేగువేరా.. నేడు రెడ్ స్టార్ జయంతి

video thumbnail
క్యూబా సోషలిస్టు విప్లవంలో తరతరాలుగా చెరిగిపోని ముద్ర వేసుకున్న విప్లవకిశోరం చేగువేరా. సామ్రాజ్యవాదానికి సింహాస్వప్నం. ప్రపంచ విప్లవ చరిత్రలో చేగువేరా సుస్థిరమయిన స్థానాన్ని సంపాదించు కున్నారు. అందుకే గొప్ప విప్లవకారుడయ్యారు. విప్లవం అన్న మాటకు ప్రతీకగా, ప్రేరణగా నిలిచారు. ఎర్నెస్టో చే గువేరా 1925లో అర్జెంటీనా రోసిరోలో జన్మించారు. ఇంజనీరింగ్‌ విద్య చదువుతున్నప్పుడు వ్యాధిగ్రస్థుల బాధలను చూసి చలించిపోయిన చేగువేరా ఇంజనీరింగ్‌ విద్యని మధ్యలో నిలిపివేసి అనంతరం బ్యూనస్‌ ఎయిర్స్‌లో వైద్య విద్య అభ్యసించారు. చదువు పూర్తయ్యాక లాటిన్‌ అమెరికా అంతటా పర్యటించారు. ఉత్తర ఆమెరికాలో రైతులు, బొగ్గుగని కార్మికులు పీడిత తాడిత ప్రజలు అనుభవిస్తున్న దుర్బర జీవితాలను నరకయాతనలను చూసి చలించిపోయారు. నిరుద్యోగం, దారిద్య్రం, అంట రానితనం, పేదరికం, ఆత్మహత్యలు, ఆకలిచావులు, దోపిడీి దారుల ఆరాచకాలు మనస్సులో ఆలోచనలు రేకెత్తిం చాయి. అమెరికా సిఐఎ ప్రోద్బలంతో జాకబ్‌ అర్బంజ్‌ ప్రభుత్వాన్ని కూలదోసిన తీరు చేగువేరా ప్రత్యక్షంగా చూశారు. తన ప్రాణాలకు ముప్పు వుందని తెలిసికూడా తప్పని పరిస్థితిలో మెక్సికో వెళ్ళి నియంత బాటిస్టాను కూలదోసేందుకై పోరాడుతున్న క్యూబా విప్లవకారులతో అక్కడే పరిచయాలు ఏర్పాటు చేసుకున్నారు. 1955 జులైలో చేగువేరా కాస్ట్రోను కలుసుకున్నారు. కాస్ట్రో వ్యక్తిత్వం ఆయనకు ఎంతో నచ్చింది. వారితో పాటు పోరాటంలో చేరారు.క్యూబన్లే అతనికి చే అని పేరు పెట్టారు. అర్జెంటీనాలో ఆత్మీయులను ప్రేమగా పిలిచేపేరు అది. 1955 ఆగస్టు 19న చేగువేరా హిల్డా గసీయా అనే ఆర్థికవేత్తను వివాహం చేసుకున్నారు. ఆ వివాహానికి కొద్ది మంది సన్నిహితులు, మిత్రులు మాత్రమే హాజరయ్యారు. చేగువేరా క్యూబా విప్లవకారులతో కలిసి విప్లవోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. గ్రాన్మా యుద్ధనౌకలో క్యూబాలో చేరి సెర్రియా మెస్త్రా పర్వతశ్రేణులు చేరుకున్నారు. అక్కడి నుంచి చాపకింద నీరులా క్యూబా అంతటికీ విప్లవ కార్యకలాపాల విస్తరింపజేశారు.
Disclaimer DMCA