Ayyappa Swamy Padi Pooja Song | Kurnool Mayor B.Y. Ramaiah | Swamy Sharanam | Irimudi Kattu Best DJ |
|
అంగరంగ వైభవంగా పడిపూజా మహోత్సవం!!
• మేయర్ క్యాంపు కార్యాలయం ఎదుట అంగరంగ వైభవంగా బి.వై. రామయ్య గారి అధ్వర్యంలో పడిపూజా మహోత్సవం • ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యేలు కాటసాని, హఫీజ్, కమిషనర్ బాలాజీ, మాజీఎమ్మెల్యే ఎస్వి దంపతులు • ప్రజలందరికి అయ్యప్పస్వామి ఆశీస్సులు కలగాలని ప్రార్థించినట్లు మేయర్ వెల్లడి. కర్నూలు: 03-12-2021 శుక్రవారం నగరంలోని 19వ వార్డు గణేష్ నగర్లో ఉన్న మేయర్ స్వగృహం & క్యాంపు కార్యాలయ ఎదుట నగర మేయర్, వైయస్ఆర్ సిపి కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బి.వై. రామయ్య గారి అధ్వర్యంలో, శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. రాత్రి వరకు జరగనున్న అయ్యప్పస్వామి పడిపూజా మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, హఫీజ్ ఖాన్ గారు, కమిషనర్ డి.కే. బాలజీ గారు, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి దంపతులు, డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక గారు, అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్ గారు హాజరయ్యారు. ఉదయమే ఏర్పాటు చేసిన మండపంలో మేయర్ కుటుంబ సమేతంగా అయ్యప్పస్వామికి పూజలు నిర్వహించి, హారతితో ప్రారంభించారు.తాంత్రిక పూజారి హరి గురుస్వామి పూజాలు నిర్వహించారు.అదే విధంగా 350 మందికి పైగా స్వాములు భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ బి.వై. రామయ్య గారు మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖసంతోషాలతో, దినభివృద్ది చెందాలని అయ్యప్పస్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు శ్వేతరెడ్డి, అరుణ, లక్ష్మిరెడ్డి, సుదర్శన్ రెడ్డి, మునెమ్మ, పుల్లమ్మ, లక్ష్మికాంత రెడ్డి, సాన శ్రీనువాసులు, విక్రమసింహా రెడ్డి, కాశిరెడ్డ వెంకటేశ్వర రెడ్డి, నాయకులు సుధా, నారయణమ్మ, వేదవతి, గోపాల్ రెడ్డి, బెల్లం మహేష్, శేషియాదవ్, హనుమంత్ రెడ్డి, కృష్ణ మమూర్తి, తిరుపాల్, చిన్న, మురళీ, నాగరాజు, శివరామ్, స్రావన్, చంద్రిక, సుభాషిణి, జాన్, శ్రీనూ, తదితరులు కూడా హాజరయ్యారు. |