♫musicjinni

తండ్రి గొప్పతనం గురించి ఎందరో గొప్ప కవులు పలికిన అమృత గుళికలు | A V Gurava Reddy |Father's Day 2023

video thumbnail
కొన్ని ప్రేమలు పుట్టుకతోనే అర్థమవుతాయి,
మరి కొన్ని బాధ్యతల బరువులో బోధించబడతాయి!
నాన్న అనే పదం, ఆ బంధం
ఎంత బరువైనదో, అంత లోతైనది!
ఎంత లోతైనదో, బయటకి అంత తేలికైనది!
పడి లేచి... ఓడి గెలిచి...
కన్నీళ్ళని దాచగలిగిన నాన్న,
కొక్కెంపై చమట సుగంధాన్ని దాచలేకపోయాడు!
రోజంతటి కష్టాన్ని చిరునవ్వుతో దాయగలిగిన,
సాయంకాలం వాలు కుర్చీ మీద అలసటని దాచలేకపోయాడు!
ముందుకు నడవాలని మొట్టికాయలేసిన కోపంలో, ప్రేమను దాచగలిగిన,
రాత్రికి దుప్పటికప్పిన వెచ్చదనంలో తన కరుణని దాచలేకపోయాడు!
నాన్న బహుశా కొబ్బరి కాయలాంటి వాడేమో,
బయటకి పీచున్నా, రాతితో కానీ పగలని తీరున్నా,
లోపల, ప్రేమని తలపించే మృదువైన దూది పింజల్లాంటి అరుదైన తీపుంది..
కరుణని మధించే భావోద్వేగపు చల్లని నీరుంది!
అందుకే బహుశా, అవి దేవుడికి ప్రసాదమవుతాయి
నాన్నలాంటి తత్త్వం సమాజానికి సమిధలవుతాయి!
ఇలాంటి భావోద్వేగ సంద్రంలో,
సిరా చుక్కలని ఆర్ఘ్యంగా
పదాల దోసిట్లో వదిలిన కవులెందరో..
ఆ తర్పనని, తనివి తీరా రమిస్తూ
మీ అందరితో పంచుకుందామని..ఇలా..
Disclaimer DMCA