♫musicjinni

Geetu Bigg Boss:

video thumbnail
Geetu Bigg Boss: గీతు ఎర్రగడ్డ చేష్టలు.. బాగా ముదిరిందయ్యో!! ఈ సోది ఏంట్రా సా..మీ

Bigg Boss 6 Telugu: ఆటలో ఆమె తోపే.. ఉన్న వాళ్లలో కాస్తో కూస్తో గేమ్ ఆడేది కూడా ఆమె. కానీ ఆమె తెచ్చిపెట్టుకున్నట్టుగా మాట్లాడే చిత్తూరు యాస.. ఆమె బాడీ లాంగ్వేజ్.. బిహేవియర్.. యాటిట్యూడ్ చూస్తూ గీతుని యాక్ థూ అనేట్టుగానే ఉంటాయి.

బిగ్ బాస్ హౌస్‌లో బ్యాటరీ రీచార్జ్ టాస్క్ ఎమోషనల్‌గా సాగుతోంది. నిన్నటి రాత్రి ఎపిసోడ్‌లో ఆదిరెడ్డి.. తన భార్య కవితతో వీడియో కాల్ మాట్లాడిన ఎపిసోడ్ బాగా పేలింది. అయితే నేటి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. ఇందులో గీతు పిచ్చి చేష్టలతో చిరాకు తెప్పిస్తుంది. హౌస్‌లో ఉన్నవాళ్లంతా దద్దమ్మలు మాదిరిగానే ఉన్నారు. వీళ్లందర్లోనూ కాస్తో కూస్తో పర్వాలేదనిపిస్తుంది గీతు. అంతవరకూ ఓకే కానీ.. ఆమె అతి చేష్టలు ప్రేక్షకులకు తలభారంగా మారాయి.

ఏంట్రా సామీ.. పిల్లకాయలు.. తొక్క కాయలు అంటూ సీమ భాషను ఖూనీ చేస్తూ ఆమె నోరు తెరిస్తే బూతు అన్నట్టుగా మారింది. కావాలనే పట్టి పట్టి అలా మాట్లాడటం చిరాకుపుట్టిస్తుంది. నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ నన్ను ఏడిపించవా? నాకు ఎమోషన్స్ లేవు.. ఆదిరెడ్డి ఏడుస్తున్నాడ్రో అంటూ తెగ అతి చేసింది. ఇక శ్రీహాన్ మటన్ తినేటప్పుడు అయితే గీతు నిజంగానే యాక్ ‘థూ’ అనేట్టుగానే ప్రవర్తించింది. గీతు కామెడీ అనుకుంటుంది కానీ.. చూసేవాళ్లకి మాత్రం ఇదెక్కడదిరా బాబూ.. ఇలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది అని సందేహపడుతున్నారు.
గీతు తలకి దెబ్బ తగిలి.. కోమాలోకి పోవడం.. మతిమరుపు రావడం.. ఇవన్నీ చూస్తే ఆ ఎఫెక్ట్ ఇంకా ఉందా? ఈ పిచ్చి చేష్టలు దాని ప్రభావమేనా? అనేట్టుగా ఉన్నాయి. అయితే బిగ్ బాస్ అయితే మాత్రం.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఏ కంటెస్టెంట్‌కి ఇవ్వని ప్రాధాన్యత గీతుకి ఇస్తున్నారు. ప్రతి ప్రోమోలోనూ ఆమె.. ఫుటేజ్ మొత్తం ఆమెదే. హౌస్‌లో ఉన్నారో లేదో అన్నట్టుగా కొంతమందిని సైడ్ వేస్తున్న బిగ్ బాస్.. గీతు చేసే ప్రతి పిచ్చిపనికి ఫుల్ ఫోకస్ ఇస్తున్నాడు

తాజా ప్రోమోలోనూ అదే చేశారు బిగ్ బాస్. గీతుని హైలైట్ చేయాలనే ఆత్రంలో చిరాకుపుట్టేట్టు చేశారు. ఆదిత్య స్మోకింగ్ మానేసేట్టు ఒప్పిస్తే.. ఇంటి బ్యాటరీ 90 శాతం పెరుగుతుందని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. ఇంటి సభ్యులంతా టాస్క్ అయ్యేవరకూ ఏమీ తినకూడదు.. లేదంటే బాలాదిత్య స్మోకింగ్ మానేయాలి అని అందరి ముందు చెప్పింది గీతు. అయితే ఆదిత్య.. ఈ మాట నువ్ నాకు స్ట్రైట్ గా చెప్పి ఉంటే అందంగా ఉండేది అని అన్నారు బాలాదిత్య.. అందమైన పనులు ఆమె ఎందుకు చేస్తుంది కానీ.. ఆ తరువాత మరి సోది చేష్టలతో చెలరేగిపోయింది గీతు.
ఆమె ఫేస్ చూస్తేనే కంపరం అన్నట్టుగా అతి చేష్టలు చేసింది. ‘నాకు కుక్క బొచ్చు కావాలి.. ఆడియో కాల్ కావాలని అడిగింది.. ఫోన్ కట్టైనా మాట్లాడుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చింది.. ఆ తరువాత ఆమె యాటిట్యూడ్.. నడచే విధానం.. ప్రవర్తించే తీరు.. ఇవన్నీ చూస్తే ఆ యాక్సిడెంట్‌లో ఆమె చిన్న మెదడు ఏమైనా చితికిందా? అనేట్టుగా ప్రవర్తించింది.
ఇక మన కక్కర్తి రాజా అర్జున్ అయితే.. ఈ బ్యాటరీ టాస్క్‌లో సైతం శ్రీ సత్య కోసమే త్యాగం చేయడానికి రెడీ అయిపోయాడు. నువ్ మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడవా? ఆడియో కాల్.. వీడియో కాల్ ఆప్షన్ తీసుకుంటావా? అంటే.. శ్రీ సత్యకి షేర్ చేయొచ్చా అని అడుగుతున్నాడు.. ఇలాంటి వాడ్ని బిగ్ బాస్ ఎందుకు కాపాడుతూ వస్తున్నాడో మరి.
Disclaimer DMCA