Karthikeya Songs - Prasnante | TELUGU LYRICS |
|
Karthikeya Songs - Prasnante | TELUGU LYRICS
My Mail ID: motivatedfittube@gmail.com ప్రశ్నంటే నింగినే నిలదీసే అల ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా బదులంటే ఎక్కడో ఏ చోటో లేదురా శోధించే చూపులో ఓ నలుపై గెలుపై దాగుందంట ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా... బ్రతుకును లాగటం బరువేగా మనసుకి సరికొత్త క్షణాలకై వెతికే దారిగా... అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ ప్రశ్నంటే.... ప్రశ్నంటే నింగినే నిలదీసే అల ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా చరణం-1: పలు రంగులు దాగి లేవా పైక్కనిపించే తెలుపులోన చిమ్మ చీకటి ముసుగులోను నీడలు ఎన్నో ఉండవా అడగనిదే ఏ జవాబు, తనకై తానెదురుకాదు అద్భుతమే దొరుకుతుంది అన్వేషించారా ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా... బ్రతుకును లాగటం బరువేగా మనసుకి సరికొత్త క్షణాలకై వెతికే దారిగా... అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ ప్రశ్నంటే నింగినే ... నిలదీసే అల ప్రశ్నించే లక్షణం ... లేకుంటే ఎలా చరణం-2: ఎపుడో ఎన్నేళ్ళనాడో నాందిగా మొదలైన వేట ఎదిగే ప్రతి మలుపుతోను మార్చలేదా మనిషి బాట తెలియని తనమే పునాది... తెలిసిన క్షణమే ఉగాది తెలివికి గిరిగీత ఏది... ప్రయత్నించరా ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా... బ్రతుకును లాగటం బరువేగా మనసుకి సరికొత్త క్షణాలకై వెతికే దారిగా... అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ ప్రశ్నంటే నింగినే నిలదీసే అల ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా ---------------------Disclaimer--------------------- Copyright Disclaimer Under Section 107 of Copyright Act 1976, Allowance is made for "fair use" for purposes such as criticisms, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use I do not own anything. All credits go to the right owners. |